ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 12వ తేదీన దీనికి సంబంధించిన నోటిషికేషన్‌ విడుదల కానుంది. మార్చి 19వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లు వేయవచ్చు. 20వ తేదీ రోజు ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలిస్తారు. ఏప్రిల్‌ 7వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఏప్రిల్‌ 9వ తేదీ రోజు కౌంటింగ్‌ జరుగుతుంది. ఏప్రిల్‌ 13వ తేదీ రోజు వరకు ఈ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ ముగుస్తుందని అధికారులు తెలిపారు. భూపతిరెడ్డిపై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి ఈ ఎన్నిక జరుగుతుంది.