తెలంగాణలో మహిళలకు అద్భుత అవకాశాలు

 రంగంలో మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో అవకాశాలను కల్పిస్తుండటం గొప్ప విషయమని పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ వైస్‌చైర్‌పర్సన్‌ స్వాతి పిరమల్‌ అన్నారు. ఈ రంగంలోకి రావడానికి తన తండ్రే కారణమని తెలిపారు. తాను రూ.10 కోట్లతో కొనుగోలు చేసిన కంపెనీ, ప్రస్తుతం రూ.5 వేల కోట్ల టర్నోవర్‌కు చేరుకొన్నదని చెప్పారు. బయోఏషియా-2020 సదస్సులో భాగంగా బుధవారం హెచ్‌ఐసీసీలో జరిగిన ప్యానల్‌ డిస్కషన్‌లో ఈవై గ్లోబల్‌ హెల్త్‌సైన్సెస్‌ అండ్‌ వెల్‌నెస్‌ లీడ్‌ పార్టనర్‌ పమేలా స్పెన్స్‌ మాడరేటర్‌గా వ్యవహరించగా.. స్వాతి పిరమల్‌, బయోకాన్‌ బయోలాజిక్స్‌ ఇండియా సీఈవో క్రిస్టినా హామచెర్‌, సాన్‌డోజ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ హెడ్‌ అరంకా స్టెఫాని, కంట్రీ హెడ్‌ నివృతిరాయ్‌ ప్యానలిస్టులుగా పాల్గొన్నారు.