అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనలో భాగంగా ప్రఖ్యాత చారిత్రక పర్యాటక ప్రదేశం తాజ్‌మహల్ ను సందర్శించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు తాజ్‌మహల్‌ను సుందరీకరించే పనిలో పడ్డారు. తాజ్‌మహల్ ప్రాంగణంలో ఉండే పౌంటేన్‌లోని నీటిని యమునా నదిలోకి వదిలారు. పౌంటేన్‌కు మళ్లీ రంగులు వేయడంతోపాటు శుద్దమైన నీటితో నింపనున్నారు. ట్రంప్ పర్యటన నేపథ్యంలో అమెరికా భద్రతా సిబ్బంది తాజ్‌మహల్‌కు చేరుకుని శాంతిభద్రత చర్యలను పర్యవేక్షిస్తోంది.
డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకోనున్నారు. అహ్మదాబాద్‌లో కొత్తగా నిర్మించిన క్రికెట్ స్టేడియంలో ‘నమస్తే, ట్రంప్' కార్యక్రమంలో పాల్గొననున్నారు.